'దేశమే ఊపిరిగా ప్రధాని మోదీ పాలన': బండి సంజయ్ కొనియాడవు

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన ఊపిరే దేశంగా, ప్రజా క్షేమమే పరమావధిగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని బండి సంజయ్ కుమార్ కొనియాడారు. దేశాభివృద్ధే అంతిమ లక్ష్యంగా ఆత్మనిర్భర్ భారత్ కోసం మోదీ అడుగులు వేస్తున్నారని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.