కూటమి ప్రభుత్వం నుంచి మరో డీఎస్సీ నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మరో డీఎస్సీ ప్రకటన విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్టోబరు 15న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఉపాధ్యాయ ఖాళీల వివరాలతో ప్రాథమిక జాబితాను సిద్ధం చేశారు. డీఎస్సీతో పాటు డైట్, ఎస్‌సీఈఆర్టీ, జూనియర్ లెక్చరర్లు మరియు లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కూడా ప్రకటనలు వెలువడనున్నాయి. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది.