షాకింగ్ ఘటన: భార్య తల నరికి, తండ్రిని హతమార్చిన వ్యక్తి అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Bankura
పశ్చిమ బెంగాల్లోని బాంకురా జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసిందని పోలీసులు వెల్లడించారు. మంగళ్ చౌదరి అనే వ్యక్తి తన భార్య రుంపా చౌదరి తలను వేరుచేసి, తండ్రి రాజేంద్ర చౌదరిని పదునైన ఆయుధంతో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం భార్య తెగిన తలను ఒక ఆలయం వద్ద ఉంచడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘోర నేరానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.