ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: సరస్వతీ దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఆరోరోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అన్ని రకాల వీవీఐపీ దర్శనాలు రద్దు చేసి ఉచిత క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నామని, సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు.