ముంబైలో వీధి పిల్లి అదృశ్యం కలకలం: బేషరతుగా క్షమాపణలు కోరిన కేఫ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Mumbai

ముంబైలోని బాంద్రా వెస్ట్ లోని ప్రముఖ కేఫ్ ఛాయోస్ అవుట్లెట్ వెలుపల నివసించే వీధి పిల్లిని సిబ్బంది వేరే ప్రాంతానికి తరలించడం తీవ్ర దుమారానికి దారితీసింది. పిల్లి అదృశ్యమవ్వడంపై జంతు ప్రేమికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేఫ్ యాజమాన్యం స్పందించింది. సిబ్బంది చేసిన తప్పునకు బేషరతుగా క్షమాపణలు కోరినట్లు ఛాయోస్ సంస్థ సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించింది. పిల్లి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వారు స్పష్టం చేశారు.