భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ: ప్రపంచకప్ ఆడే అవకాశం ఉందన్న రవిచంద్రన్ అశ్విన్

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లలో రాణించడం ద్వారా వన్డే జట్టులోకి అద్భుతమైన పునరాగమనం చేసే అవకాశం ఉందని ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్ పర్యటనలో అతను ప్రదర్శించే ప్రతిభ ఆధారంగా సెలెక్టర్లు అతన్ని ప్రపంచకప్ టోర్నమెంట్కు పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే నైపుణ్యం కలిగిన భువనేశ్వర్ భారత జట్టుకు ఎంతో కీలకమని, ఫిట్నెస్ నిలబెట్టుకుంటే మెగా టోరీలో బరిలోకి దిగుతాడని అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు.