భారత సెమీకండక్టర్ రంగానికి పన్నెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

భారత కొత్త సెమీకండక్టర్ విధానం ప్రారంభించిన కొద్ది నెలల్లోనే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి పన్నెండు బిలియన్ డాలర్ల పెట్టుబడుల హామీలు వచ్చాయని కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో జరిగిన చిప్ పరిశ్రమ సదస్సులో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ భాగస్వామ్యంతో టాటా గ్రూప్, మైక్రాన్ వంటి సంస్థలు దేశంలో చిప్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి.