రాజకీయ విమర్శలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం
రిపోర్టర్: సతీష్
స్థలం: చెన్నై
రాజకీయ నాయకులను విమర్శించినంత మాత్రాన అరెస్టు చేసేయలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. డీఎంకే కౌన్సిలర్ డి.సుధకు ముందస్తు బెైలు మంజూరు చేస్తూ జస్టిస్ ఎన్.రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. ఉన్నత పదవుల్ లో ఉన్న వారు విమర్శలను, ఎగతాళిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. హింసను రెచ్చగొట్టని రాజకీయ ప్రసంగాలపై పోలీసులు అణచివేత చర్యలకు పాల్పడటం సరికాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.