తుఫాన్ బాధితులను పరామర్శించిన ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి కుమార్
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆమదాలవలస వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త చింతాడ రవి కుమార్ పరామర్శించారు. కోర్లకోట, చీమలవలస, కొత్తవలస, అల్లెన, కిలంత్ర, జిబి పురం గ్రామాలలో పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున బాధితులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు.