ప్రేమ వివాహాలపై హర్యానా గ్రామ పంచాయతీ వివాదాస్పద తీర్మానం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హర్యానా
హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లా ఆర్య నగర్ గ్రామంలో జరిగిన సామాజిక పంచాయతీలో ప్రేమ వివాహాలపై సంచలన తీర్మానం చేశారు. కులవ గోస్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఒకే గ్రామానికి చెందిన వారు ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఇటీవల గ్రామంలో జరిగిన మూడు ప్రేమ వివాహాల నేపథ్యంలో గ్రామ పెద్దలు ఈ కఠిన నిర్ణయం తీసుకోగా, ఇలాంటి ఆదేశాలకు చట్టబద్ధత లేదని, నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.