కూటమికి సోషల్ మీడియా వార్ పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది!
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం కంటే స్వతంత్ర సోషల్ మీడియా శ్రేణుల ఈగో వార్ నుంచే ఎక్కువ ముప్పు పొంచి ఉంది. అభివృద్ధిని పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలు, సినిమా ఆధిపత్య పోరుతో శ్రేణులు కొట్లాడుతుండటంతో ప్రతిపక్షం ఫేక్ నెరేటివ్కు అవకాశం దక్కుతోంది. పరిస్థితి చేయి దాటుతుండటంతో అధిష్టానాలు తీవ్రంగా స్పందించి హెచ్చరికలు జారీ చేశాయి.