స్థానిక ఎన్నికల సమరానికి టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలన్న మంత్రి
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రేణులను అప్రమత్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అందరూ సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.