పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని టీజీపీసీబీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి వెల్లడి

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

సనత్ నగర్ లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీపీసీబీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి లక్కాడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. పర్యావరణ పరిరక్షణకు, సహజ వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.