విజయవాడలో ఉపాధ్యాయులపై దాడి నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు

రిపోర్టర్: హరి స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలో మూడు వందల ఐదు మందిని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నూట ఇరవై ఏడుగురు నిందితులను స్పష్టంగా గుర్తించి డిజిటల్ సాక్ష్యాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. వైకాపా నేతలు దేవినేని అవినాష్, జక్కంపూడి రాజా సహా పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.