స్థానికులకే ఉద్యోగాలు: బెంగళూరు ఐటీ కంపెనీల్ లో కర్ణాటక రక్షణ వేదిక హోరు

రిపోర్టర్: రాజేష్ స్థలం: బెంగళూరు

కర్ణాటకలో స్థానిక అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు బెంగళూరులోని వివిధ ఐటీ కంపెనీలను సందర్శించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీఏ నారాయణ గౌడ పిలుపు మేరకు నూతన ఉద్యమ ప్రచారం సాగుతోంది. కంపెనీల యాజమాన్యాలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు కేఆర్వీ నాయకులు తెలిపారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివ విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రచారం కొనసాగుతోంది.