వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఆదుకుంటామన్న ఎమ్మెల్యే కోండ్రు మురళీ

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

రాజాం నియోజకవర్గంలో ఎడతెరిపిలేని భారీ వర్షాల నేపథ్యంలో మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ విస్తృతంగా పర్యటించారు. రామారాయపురం, అరసాడ గ్రామాల్లో ముంపు ప్రాంతాలను, నీటమునిగిన పంటపొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులతో సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. ఈ నివేదికలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.