జీవీఎంసీ పీఠం కైవసమే లక్ష్యంగా కూటమి సమన్వయ సమావేశం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Visakhapatnam

రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగి విజయం సాధించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని టీడీపీ నగర కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమన్వయ భేటీకి మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి, కూటమి ముఖ్య నేతలు హాజరయ్యారు. జీవీఎంసీ పరిధిలోని నూట ఇరవై వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసినట్లు నేతలు వెల్లడించారు.