మధ్యప్రదేశ్ లో ఏడీపీవో పరీక్ష ప్రాథమిక కీ విడుదల: అభ్యర్థులకు అలర్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భోపాల్
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏడీపీవో రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక కీలో ఏవైనా తప్పులు ఉంటే అభ్యర్థులు ఐదు రోజుల్లోపు ఆన్ లైన్ లో అభ్యంతరాలు తెలపాలని కమిషన్ స్పష్టం చేసింది. దీనికి తగిన ఆధారాలు సమర్పించాలని వెల్లడించారు.