గంగాపురిలో గణపతి మండపం వేదికగా ఉత్సాహంగా సాగిన క్రీడా పోటీలు
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
మంథని మండలం గంగాపురిలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గంగాపురి యూత్ గణపతి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. నాలుగో వార్డు కౌన్సిలర్ ఎరుకల స్రవంతి ఈ పోటీలను ప్రారంభించి మహిళలు, యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయని, ప్రతి రంగంలోనూ మహిళలు ముందుకు సాగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.