శ్యామల పరిస్థితిపై ఆరా: వెంటనే తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించిన లోకేష్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: గుంటూరు
శ్యామల అనారోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ ఆమెకు తక్షణమే అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఒక పౌరురాలు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ఆయన, బాధితురాలి పరిస్థితిని పరిశీలించి తగిన సాయం అందించాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించినట్లు స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజాసమస్యల పట్ల తక్షణ స్పందన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.