కబ్జాలతో పంట కాలువలు మాయమై వరద గుప్పిట్లో మునిగిపోతున్న ఇళ్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: నందలూరు
నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లెలో పంట కాలువలు కబ్జాకు గురికావడంతో ప్రతి వర్షాకాలంలో ముప్పై వందల ఇళ్లు వరద గుప్పిట చిక్కుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు కాలువలను ఆక్రమించి పూడ్చేయడంతో వర్షపు నీరు ఎటూ ప్రవహించక రోజుల తరబడి నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి కాలువలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.