వాహనదారులకు భారీ షాక్: కార్ల ధరలు పెంచనున్న వోల్వో ఇండియా
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా షిప్పింగ్ మరియు లాజిస్టిక్స్ ఖర్చులు విపరీతంగా పెరగడంతో కార్ల ధరల పెంపు తప్పదని వోల్వో కార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఈఎక్స్90 లాంచ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదనపు ఉత్పత్తి వ్యయాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం అనివార్యమైందని తెలిపారు. భారత మార్కెట్లోకి ప్రతి ఏటా కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.