వర్ధన్నపేటలో కోనారెడ్డి చెరువు నీటి ప్రవాహ కాలువ పరిశీలన

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువులోకి వరద నీరు సక్రమంగా చేరుకునేలా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్లు, చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు వర్ధన్నపేట పట్టణాధ్యక్షుడు ఈగ దామోదర్ చెరువు కట్ట, నీటి కాలువను పరిశీలించారు. వర్షపు నీరు వృధా కాకుండా కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండేటి మహేందర్, అయిత సుధాకర్, రవీందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.