ఆంధ్ర వంటకాలకు ప్రత్యేక గుర్తింపు దక్కాలన్న మంత్రి నారా లోకేష్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: గుంటూరు
ఆంధ్రప్రదేశ్ వంటకాలకు కేవలం పాఠ్యపుస్తకాల్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించాలని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. గుంటూరు గోంగూర పులావ్ నుంచి కోనసీమ పులస మరియు రాయలసీమ రాగి సంగటి వరకు ప్రతి రుచి మన సజీవ సంస్కృతికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ పత్రికలో ప్రచురితమైన బహిరంగ లేఖపై స్పందిస్తూ, మన వంటకాల విశిష్టతను భావితరాలకు చాటిచెప్పేలా కృషి చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు.