'గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత': బాపట్ల పోలీస్ వెల్లడి

రిపోర్టర్: నరేష్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలపై బాపట్ల పోలీస్ ప్రత్యేక దృష్టి సారించింది. నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు బాపట్ల పోలీస్ తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన భద్రతా సూచనలు జారీ చేశామని వెల్లడించారు. శాంతియుత, సురక్షిత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల పోలీస్ స్పష్టం చేశారు.