రైతులకు కలెక్టర్ల కాళ్లు మొక్కిించే దుస్థితి తెచ్చారంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టర్ల కాళ్లు పట్టుకునే దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లనే రైతాంగం రోడ్డున పడాల్సి వస్తోందని మండిపడ్డారు. మరోవైపు, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు.