ఆమనగల్లులో ఘనంగా పదకొండో ఆయుర్వేద దినోత్సవ వైద్య శిబిరం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు ప్రభుత్వ హాస్పిటల్ హోమియోపతి శాఖ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ ఎంగలి భాగ్యలక్ష్మి రఘు ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ దొంతు శ్రీకాంత్ ఆధ్వర్యంలో 82 మంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హోమియోపతి మందులు పంపిణీ చేశారు.