ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కలకలం: విద్యార్థిని వేధింపుల కేసులో ప్రొఫెసర్ పై వేటు
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన దౌలత్ రామ్ కాలేజీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను సెలవుపై పంపినట్లు వర్సిటీ అధికారులు బుధవారం వెల్లడించారు. అక్టోబర్ 27న ఈ ఘటన జరుగగా, అక్టోబర్ 29న బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి ప్రతినిధులు తెలిపారు. అసభ్యకర సందేశాలు పంపి, పరీక్షల్ లో ఫెయిల్ చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అంతర్గత కమిటీ విచారణ జరుపుతోందని, దోషి తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.