దళితుల భూములు గుంజుకుంటూ కాంగ్రెస్ డ్రామాలు
రిపోర్టర్: రాము
స్థలం: Erravalli
దళితుల భూములను లాక్కుని మళ్లీ మీకే ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఎర్రవల్లిలో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దళితులకు అందే సంక్షేమ పథకాలు బంద్ అయ్యాయని, కాలువలకు నీళ్లు రాక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలను పట్టించుకోకుండా తమ భూములను గుంజుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.