సంగారెడ్డిలో గంజాయి అక్రమ రవాణా భగ్నం: ఇద్దరు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ సంగారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రూ.71.40 లక్షల విలువైన 142.8 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు రెండు కార్లను సీజ్ చేశామని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ సంగారెడ్డి హెచ్చరించారు.