భగత్ సింగ్ ఆశయాలను విస్మరిస్తున్న నేటి పాలకులపై డివైఎఫ్ఐ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువజన ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పిప్పళ్ళ శివశంకర్ స్పష్టం చేశారు. ఆమనగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో భగత్ సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో మతం, కులం పేరుతో యువతను విభజిస్తున్నారని, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై భగత్ సింగ్ బాటలో పోరాటాలు సాగిస్తామని ఆయన హెచ్చరించారు.