తాండూరు గురుకుల విద్యార్థినిల ప్రతిభ ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రథమ స్థానం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తాండూరు

తాండూరు మండలం ఖాజాపూర్ గేటు వద్ద ఉన్న తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు 70వ ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు. అండర్ 17 ఖోఖో పోటీల్లో పాల్గొని నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిల బృందాన్ని, వ్యాయామ ఉపాధ్యాయురాలు అఖిలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినిలు భవిష్యత్తులో రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కూడా మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.