పెద్దపల్లిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలను సీజ్ చేసిన అధికారులు

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్డు లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కె. శ్రీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఇరవై మూడు బ్యాగుల్లో ఉన్న బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తున్న బజ్జూరి శంకర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.