సైబర్ నేరాలు ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: మహేష్
స్థలం: నాగర్ కర్నూల్
సైబర్ నేరాలు మరియు ఆర్థిక మోసాల పట్ల జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) హెచ్చరించారు. దేశంలో పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు వేగంగా విజృంభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ యాప్స్, అనుమానాస్పద లింక్స్, తెలియని ఫోన్ కాల్స్ మరియు ఆన్లైన్ మోసాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరికైనా ఎలాంటి సైబర్ మోసాలు జరిగినా వెంటనే స్పందించి పోలీసులను ఆశ్రయించాలని స్పష్టం చేశారు.