నోయిడాలో థార్ కారు బీభత్సం ఒకరు మృతి
రిపోర్టర్: శివ
స్థలం: Noida
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా బిస్రఖ్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వేగంగా వచ్చిన థార్ ఎస్ యూవీ కారు స్కూటర్ ను ఢీకొన్న ప్రమాదంలో నాల్భై ఏళ్ల నీరజ్ అనే వ్యక్తి మృతి చెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. చిపియానా గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న స్కూటర్ ను కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నీరజ్ మృతి చెందారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.