కూటమి నాయకులను బెదిరించలేదంటూ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తూర్పుగోదావరి జిల్లా
కూటమి నాయకులను బెదిరించలేదని, క్షణికావేశంలోనే మాట్లాడానని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బుచ్చెంపేటలో వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి ఏకగ్రీవ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన నియోజకవర్గంలో పార్టీకి ద్రోహం చేస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే తాను నడుచుకుంటానని, పార్టీ శ్రేణుల కోసం ఎవరితోనైనా పోరాడుతానని రాజా వెల్లడించారు.