ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు శ్రీశైలం దేవస్థానం నుంచి వైభవంగా పట్టువస్త్రాల సమర్పణ
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం నుంచి ప్రత్యేకంగా సారెను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్ మరియు ఈఓ ఆధ్వర్యంలో ఈ పట్టువస్త్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించగా, ఆలయ అర్చకులు వారికి ఘనంగా ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు బహూకరించారు.