జిల్లా అథ్లెటిక్స్‌లో రెండు స్వర్ణాలతో జాతీయ పోటీలకు ఎంపికైన చరణ్
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో వేములకొండ చరణ్ గౌడ్ పెంటాథ్లాన్, 80 మీటర్ల హర్డిల్స్‌లో రెండు బంగారు పతకాలు సాధించాడు. ఈ విజయంతో అతను జాతీయస్థాయి పోటీలకు అర్హత పొందాడు. నవంబర్ 14 నుంచి జరిగే పోటీల్లో పాల్గొననున్న చరణ్ గౌడ్‌ను కోచ్, కళాశాల అధ్యాపకులు మరియు గ్రామ పెద్దలు ఘనంగా అభినందించారు.