కొడుకే గురువుగా మారి పదో తరగతి పాసైన మూగ మహిళ
రిపోర్టర్: అశోక్
స్థలం: Jammu
జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ రూప్‌నగర్‌కు చెందిన 45 ఏళ్ల మూగ, చెవుడు ఉన్న రేణు హన్స్ 22 ఏళ్ల క్రితం ఆగిపోయిన తన చదువును కొనసాగించి పదో తరగతి పరీక్షలో 82 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆమెకు సైన్ లాంగ్వేజ్ ద్వారా చదువు చెప్పి విజయం సాధించేలా చేసిన ఆమె కుమారుడు, సైన్స్ విద్యార్థి నమన్ కౌల్ తన తల్లికి గురువుగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.