కొండేపిలో మీ భూమి మీ హక్కు: 8,500 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: బాపట్ల

కొండేపి నియోజకవర్గం నర్సింగోలులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఎనిమిది వేల ఐదు వందల మంది రైతన్నలకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి మరియు రేపల్లె ఎమ్మెల్యే ఆనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్నదాతల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పిస్తూ కొత్త పాసుపుస్తకాలను అందజేయడం జరిగిందని ఆయన పేర్కొంటూ ఎనిమిది వేల ఐదు వందల మందికి లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.