పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ జరిమానా

రిపోర్టర్: రాము స్థలం: World

భారత్ తో జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత దూకుడుగా వ్యవహరించి పెవిలియన్‌కు వెళ్లాలని సైగలు చేసినందుకు గాను మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. ఈ శిక్షను ఆమె అంగీకరించారు.