వైకాపా కుట్రలను తిప్పికొడతాం: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు కల్పిస్తే వైకాపా నాయకులు ఓర్వలేక కుట్రపూరిత అసత్య ప్రచారాలు చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గతంలో నిరుద్యోగులను పట్టించుకోని వైకాపాకు నేడు మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.