భారీ వర్షాల బీభత్సం: నీట మునిగిన పంటలతో అన్నదాతల ఆవేదన
రిపోర్టర్: శివ
స్థలం: అన్నపురెడ్డిపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో మురసు తుఫాన్ కారణంగా అకాల భారీ వర్షాలు కురిశాయని ఎస్ఐ విజయ్ సింహ రెడ్డి తెలిపారు. ఉప్పొంగుతున్న వరద ఉధృతికి వరి, మిర్చి, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. రహదారులపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు.