విద్యారంగంలో విజయంకై సైన్స్ సెమినార్ వేదికగా ఉప్పొంగిన పోటీతత్వం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస మండల కేంద్రంలో శుక్రవారం విద్యార్థుల కోసం సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. భారతదేశంలో శక్తి వనరుల పాత్ర అనే అంశంపై జరిగిన ఈ పోటీలను ఎంఈఓలు సిహెచ్ శ్రీనివాసరావు, సిహెచ్ సత్యం ప్రారంభించారు. ఈ పోటీల్లో కాశీబుగ్గ హైస్కూల్ విద్యార్థిని పి. తేజస్విని మొదటి స్థానం సాధించి, ఈనెల 21న శ్రీకాకుళంలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు.