అంధ విద్యార్థుల కోసం వాయిస్ బ్రెయిలీ ప్రింటర్ రూపొందించిన తెలుగు విద్యార్థిని హిమజ
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఏలూరు
ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని లింగంపల్లి హిమజ దేశంలోనే తొలిసారిగా వాయిస్ కమాండ్‌తో పనిచేసే సరికొత్త బ్రెయిలీ ప్రింటర్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. భీమవరంలోని విష్ణు మహిళా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న హిమజ, అంధ విద్యార్థుల కష్టాలను తొలగించేందుకు అలెక్సా సాయంతో రుద్ర పేరుతో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డును సొంతం చేసుకున్న ఈ తెలుగు అమ్మాయి ఘనత పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.