'మహిళల రక్షణే లక్ష్యంగా శక్తి యాప్ అవగాహన': బాపట్ల పోలీస్

రిపోర్టర్: సతీష్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో మహిళలు మరియు యువతకు శక్తి యాప్ ఉపయోగం గురించి ప్రత్యక్షంగా వివరించారు. ఆపద సమయంలో తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని Bapatla Police వెల్లడించారు.