వైభవ్ సూర్యవంశీకి నాయకత్వ బాధ్యతలు తొందరపాటే: సచిన్ తెందుల్కర్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూఢిల్లీ
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి చిన్న వయసులోనే వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం తొందరపాటు నిర్ణయమని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఆయన మాట్లాడుతూ, దేశవాళీ క్రికెట్ లో యువ ఆటగాళ్లకు రెడ్ బాల్ మ్యాచ్ లలో ఆడేందుకు తగినంత సమయం ఇవ్వాలని, ఒక్కో దశలో వారిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.