యాదగిరిగుట్టలో విషాదం: పుష్కరిణిలో పడి నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పుష్కరిణిలో ప్రమాదవశాత్తు పడి నాలుగేళ్ల చిన్నారి శివలింగం ఆద్య మృతి చెందిందని పోలీసులు తెలిపారు. బడంగ్‌పేట నుంచి కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చిన చిన్నారి మెట్లపై ఆడుకుంటూ నీటిలో జారిపడింది. వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.