పామూరులో పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

రిపోర్టర్: సునీల్ స్థలం: పామూరు

ప్రకాశం జిల్లా పామూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు స్వయంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా ఆలకించి, తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.