కవిరాజు శత వసంతాల వేడుకకు అంగలూరు నుంచి కాలినడకన సాయిచంద్
రిపోర్టర్: గోపి
స్థలం: గుంటూరు
తెనాలి పురపాలక సంఘ ఛైర్మన్‌గా త్రిపురనేని రామస్వామి బాధ్యతలు చేపట్టి శత వసంతాలు పూర్తయిన సందర్భంగా అక్టోబరు 3న తెనాలిలో యువజన సదస్సు నిర్వహిస్తున్నారు. అంగలూరు నుంచి ఆయన మనవడు, సినీనటుడు సాయిచంద్, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కాలినడకన ఈ వేడుకకు చేరుకోనున్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు.